SAKSHITHA NEWS

విద్యార్థులకు ఆట వస్తువులు అందించడం అభినందనీయం : మల్లు లక్ష్మి

సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : పాఠశాల విద్యార్థులకు ఆట వస్తువులు అందించడం అభినందనీయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు, రాయినిగూడెం మాజీ సర్పంచ్ మల్లు లక్ష్మి అన్నారు. బుధవారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు రాయినిగూడెం లోని మల్లు వెంకట నరసింహారెడ్డి మెమోరియల్ పాఠశాలలో కీర్తిశేషులు మేకన బోయిన సందీప్ జ్ఞాపకార్థం వారి తల్లిదండ్రులు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మేకనబోయిన శేఖర్, సైదమ్మ ల సహకారంతో ఒక లక్ష 20 వేల రూపాయల ఆట వస్తువులను రిబ్బన్ కట్ చేసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన కుమారుని జ్ఞాపకార్థ ఒక లక్ష 20 వేల రూపాయలు విలువ చేసి ఆట వస్తువులను రాయినిగూడెం గ్రామంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి మెమోరియల్ స్కూలుకు మేకనబోయిన శేఖర్, సైదమ్మ దంపతులుఅందజేయడం గొప్ప విషయం అన్నారు. ఈ ఆట వస్తువుల ద్వారా స్కూల్ విద్యార్థులకు మానసిక ప్రశాంతతతో పాటు, శారీర దారుత్యానికి దోదపడుతుందన్నారు. ఆట వస్తువులను పిల్లలు సద్వినియోగం చేసుకొని క్రీడల్లో రాణించి గ్రామానికి, మండలానికి,జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
మండల విద్యాధికారి శేష గాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకు రావడం హర్షించదగిన విషయం అన్నారు. మేకన బోయిన సందీప్ జ్ఞాపకార్థం ఆట వస్తువులే కాక మహనీయుల చిత్రాలను గీయించడం సంతోషదాయకం అన్నారు. మల్లు వెంకట నరసింహారెడ్డి మెమోరియల్ స్కూల్ లో ఇంగ్లీష్ మీడియం ద్వారా విద్యను అందించడం జరుగుతుందన్నారు. గ్రామ ప్రజలు సహకారంతో విద్యార్థుల సంఖ్యను పెంచుకొని మెరుగైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయ బృందం తీవ్రమైన కృషి చేస్తుందన్నారు.


ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిరగాని యాకయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, వార్డు మాజీ కౌన్సిలర్ ఎడ్ల గంగాభవాని యాదవ్, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, విద్యా కమిటీ చైర్మన్ ఎల్గూరి వినోద, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల వెంకన్న, జిల్లా పల్లి నరసింహారావు, ధనియాకుల శ్రీకాంత్, దండ వెంకటరెడ్డి, కొప్పుల రజిత, మద్దెల జ్యోతి, సిపిఎం పార్టీ త్రీ టౌన్ కార్యదర్శి చెట్లంకి యాదగిరి, సిపిఎం సూర్యాపేట రూరల్ మండల కార్యదర్శి మేరెడ్డి కృష్ణారెడ్డి, సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్, సిపిఎం పార్టీ టూ టౌన్ కార్యదర్శి పిండిగా నాగమణి, సిపిఎం పార్టీ నాయకులు చెరుకు సత్యం, నారాయణ వీరారెడ్డి, నల్ల మేకల అంజయ్య, కామల్ల లింగయ్య, పందిరి సత్యనారాయణ రెడ్డి, బోళ్ల నాగేందర్ రెడ్డి, మందడి రామ్ రెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎలుగూరి వెంకటేశం, ఎల్గూరి వీరయ్య గౌడ్, వెలగబోయిన మధు, రాయినిగూడెం మాజీ సర్పంచ్ ముత్యాల సైదులు, సందన బోయిన కనకయ్య, టిఆర్ఎస్ పార్టీ నాయకులు చిత్తలూరి కృష్ణ, ముత్యాల పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app