పాత ఆర్కాడులో దళితులకు ఇచ్చిన భూములకు దారి సౌకర్యం కల్పించండి

Spread the love

Provide access to the lands given to Dalits in the old arcade

పాత ఆర్కాడులో దళితులకు ఇచ్చిన భూములకు దారి సౌకర్యం కల్పించండి.

సిపిఐ పార్టీ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య డిమాండ్

 విజయపురం మండలం లోని చిన్న        జంబాడ  గ్రామంలో దళితులకు 1988 లో భూములు ఇవ్వడం జరిగింది, 

ఆ భూమికి దారి కూడా కల్పించడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి రామచంద్ర రాజు అనే వ్యక్తి మాకు పట్టా ఉంది.

కావున రోడ్డు కూడా లేదని పూర్తిగా పెన్సింగ్ వేయడం జరిగింది.

స్థానిక ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇచ్చిన కూడా తీసుకోకపోవడం దారుణం,

పేదలు వినతి పత్రాలు ఇస్తే రెవెన్యూ అధికారులు పరిశీలించి స్పందించాల్సిన అవసరం ఉంది

కానీ విజయపురం లో ఉన్న ఎమ్మార్వో అతనికి అనుకూలంగా మాట్లాడి దళితులు వినతి పత్రం ఇచ్చిన స్వీకరించలేదు,

ఇప్పటికైనా ఎవర్ని యంత్రాంగం ఆ భూములకు రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆ రోడ్డు ద్వారానే పశువులు మేకలు అన్ని మేతకు వెళుతుంటాయి

చుట్టుపక్కల గ్రామస్తులు ఇలాంటి దారిని మూసివేయడం దుర్మార్గమైన చర్య
అంతేకాదు చిన్న జంబాడలోని సంబంధించిన రామ రాజు అనే పేద రైతు 70 సంవత్సరాలుగా మామిడి చెట్లు పెట్టుకుని ఒక ఎకరా భూమిని తన ఆధీనములో చెట్లు కాపు తీసుకొని కుటుంబ పోషిస్తున్నాడు,

కానీ ఎలాంటి నోటీసు లేకుండా ముందే హెచ్చరిక లేకుండా 40 సంవత్సరాల వయసు కలిగిన మామిడి చెట్లను జెసిబి ద్వారా కూల్చివేయడం జరిగింది,

ఇలాంటి వారి పైన చర్యలు తీసుకునేందుకు కూడా రెవెన్యూ అధికారులు ముందుకు రావడం లేదు

, అందువలన ఈ రోజున గిరి ఆర్ డి ఓ గారికి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చి దళిత రైతులను ఆదుకొని దారి ఏర్పాటు చేసి, 

మామిడి చెట్లను కూల్చివేసిన చేసిన రైతుకు న్యాయం చేసి ,

దౌర్జన్యంగా చేసిన వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలని కోరారు.

అనంతరం ఆర్డీవో గారు మాట్లాడుతూ దారి చూపిస్తామని, రైతు కు జరిగిన అన్యాయాన్ని విచారించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు

ఈ కార్యక్రమం లో సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి వేలన్. రైతు నాయకులు మాధవ రాజు .శ్రీనివాసులు లోకనాథం. వెంకట్ రాజు
అమ్మ.రెైతులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page