పేద విద్యార్థినికి ఆర్థిక సాయం అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క
గురువారం ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ములుగు మండలం పత్తిపెల్లి గ్రామానికి చెందిన జూపాక శ్రీనిత్య ఇటీవలే ఎంబీబీఎస్ లో సీటు సాధించగా సీతంపేట సొసైటీ వారి సహకారం తో 40వేల ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.
ఈ సందర్భంగా మాట్లాడుతూ
దళిత కుటుంబంలో పుట్టిన ఆణిముత్యం శ్రీ నిత్య కష్ట పడి చదివి ఉన్నత చదువులు చదువుకోవడానికి పేదరికం అడ్డు కాదు అని దృడ సంకల్పంతో ఎంబీబీఎస్ లో సీటు సాధించిన శ్రీ నిత్య ఎంబీబీఎస్ పూర్తి చేసి పేద ప్రజలకు సేవ చేయాలని ఆర్థిక సాయం అందించిన సేతంపేట సొసైటీ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా
బుస్సాపూర్ మాజీ సర్పంచ్
యాదగిరి, సహకార సంఘం డైరెక్టర్ మాధవ రెడ్డి, ఆర్శం రఘు తదితరులు పాల్గొన్నారు.

