విద్యార్థుల కోసం ఉన్నత పాఠశాల మరమ్మతులు చేయించిన పోలీస్ కానిస్టేబుల్

Spread the love

Police constable Venkoji who repaired the high school for the students

విద్యార్థుల కోసం ఉన్నత పాఠశాల మరమ్మతులు చేయించిన పోలీస్ కానిస్టేబుల్ వెంకోజి

సాక్షిత ప్రతినిధి. వెల్దండ మండల పరిధిలోని కొట్ర గ్రామంలోని ఉన్నత పాఠశాల ఇటీవలే వర్షాలకు పాఠశాల ఆవరణ అంతా వర్షపు నీటితో జాలుపట్టి బుడదమయంగా మారింది.

దీంతో విద్యార్థులకు క్రీడలు ప్రార్థనలకు అంటకం ఏర్పడి భారీగా గడ్డి పాఠశాల మైదానం లో మొలిచింది. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ వెంకోజి విద్యార్థుల కోసం మైదానంలో మట్టి పోయించి క్రీడలకు ప్రార్థనలకు మైదానం పనికి వచ్చేలా చదును చేస్తానని ఉపాధ్యాయులకు హామీ ఇవ్వడం జరిగింది.

ఇచ్చిన హామీ ప్రకారం కానిస్టేబుల్ వెంకోజి తన సొంత ఖర్చులతో ఉన్నత పాఠశాలలో టిప్పర్ల ద్వారా మట్టి పోయించి చదును చేయించడం జరిగింది. పాఠశాల విద్యార్థులు ఇబ్బందులను గుర్తించిన కానిస్టేబుల్ వెంకోజి ను కోట్ర గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రామారావు. ఉపాధ్యాయులు. విద్యార్థులు తదితరులు ఉన్నారు

Related Posts

You cannot copy content of this page