SAKSHITHA NEWS

కేసీఆర్ కు ప్రధాని మోడీ లేఖ !

హైదరాబాద్ ; బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ (KCR)కు ప్రధాని మోడీ (Narendra Modi) సంతాప సందేశం పంపారు. ఈ మేరకు ప్రధాని మోడీ పీఎంవో ఆఫీస్ నుంచి ఒక లేఖ విడుదల చేశారు. ఇటీవల కేసీఆర్ సోదరి (అక్క) చీటి సకులమ్మ (sakalamma) మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు. కేసీఆర్ సోదరి మరణం గురించి మరణ వార్త తెలుసుకుని దిగ్భ్రాంతి చెందానని లేఖలో పేర్కొన్నారు. ఈ అనుకోని ఘటన ఎంతో బాధకు గురిచేసిందని, కుటుంబ సభ్యులకు తీరని లోటుగా మిగిలిపోతుందని తెలిపారు. సోదరి మరణంతో బాధాతప్త హృదయంతో ఉన్న కేసీఆర్‌కి వారి కుటుంబ సభ్యులకు ప్రధాని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, మాజీ సీఎం కేసీఆర్ సోదరి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.

చీటి సకులమ్మ మరణం పట్ల రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. ఇక కేసీఆర్ తన సోదరిని కడసారి చూసుకునేందుకు ఫౌంహౌస్ వీడి ఆమె ఇంటికి చేరుకుని ఘన నివాళులు అర్పించారు. హరీశ్ రావు, కేటీఆర్, కవిత సైతం సకలమ్మ పార్థివ దేహానికి నివాళ్లు అర్పించారు. సకులమ్మ కుటుంబ సభ్యులను బంధువులను కేసీఆర్ ఓదార్చారు. కాగా, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సకలమ్మ(82) హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మ‌ృతి చెందారు. కేసీఆర్‌కు సకులమ్మ 5వ సోదరి, ఆమె స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పెదిర గ్రామం. ఆమె భర్త హన్మంతరావు గతంలోనే మృతి చెందారు. వారికి ముగ్గురు కుమారులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app