SAKSHITHA NEWS

సీఎం ఆఫీస్‌లో అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలు తొలగింపు.. అసెంబ్లీలో ప్రతిపక్షాల మండిపాటు

ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే సభలో గందరగోళం నెలకొంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న అంబేద్కర్, భగత్ సింగ్‌ల ఫోటోలు తొలగించారని ఆరోపిస్తూ ఆప్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మాజీ సీఎం ఆతిశీ.. రేఖా గుప్తా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ దళిత వ్యతిరేక, సిక్కు వ్యతిరేక పార్టీ అని మరోసారి తేలిపోయిందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app