SAKSHITHA NEWS

సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఎటువంటి అపోహలు పడొద్దు. ఇది నిరంతర ప్రక్రియ – 48 వ డివిజన్ వార్డ్ సభలో ఎంఎల్.ఏ. నాయిని రాజేందర్ రెడ్డి..

సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఎటువంటి అపోహలు పడొద్దని అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఇది నిరంతర ప్రక్రియ అని 48 వ డివిజన్ దర్గా పంచాయతి ఆఫీసు దగ్గర జరిగిన వార్డ్ సభలో వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…

ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డ్ ల పంపిణి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కోసం లబ్ది దారులను గుర్తించేందుకు ఈ వార్డ్ సభలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

ప్రజా పాలన దరఖాస్తులు గతంలో మీ సేవ కేంద్రాల్లో వచ్చిన దరఖాస్తులు, కుల గణన ప్రభుత్వం దగ్గర ఉన్న పేద కుటుంబాల సమాచారం ఆధారంగా లబ్దిదారుల ఎంపిక జరిగిందని అన్నారు.

ఇంతేకాకుండా ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే వీటిని కూడా స్వీకరించి పరిశీలించడం జరుగుతుంది. అట్టి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారికి లబ్ది చేకూరుస్తాం.

సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఎటువంటి అపోహలు పడొద్దని అన్నారు. అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఇది నిరంతర ప్రక్రియ అని అధికారులు సమన్వయంతో అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ స్థానిక కార్పొరేటర్ సర్తాజ్ బేగం, మాజీ కార్పొరేటర్ అబుబాకర్, సీనియర్ నాయకులు షేక్ అమర్, డివిజన్ అద్యక్షుడు సింగారపు రవి ప్రసాద్, మట్టెడ కుమార్, ఏం. వేణు, లావుడ్య రవి, అంబాల శ్రీనివాస్, తిరుమల్, టి. సతీష్, మొహమ్మద్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.