రాష్ట్రంలో ప్రజల కోసం పని చేసే ప్రభుత్వం కావాలి: డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
హనుమకొండ జిల్లా (మే 18): కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ తన కార్యాలయంలో మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో పది జిల్లాలు ఉండేవి. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అంతటి పెద్ద జిల్లాలను కూడా సమతౌల్యం చేస్తూ ప్రతి పేద మధ్య తరగతి పరిస్థితులను జీవన మనుగడలను పరిగణలోకి తీసుకుంటూ ప్రజా పరిపాలన చేసింది. అలాంటి జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలు చేసింది. జిల్లాల కు అనుగుణంగా ప్రజాప్రతినిధులను సైతం ప్రభుత్వానికి అనుగుణంగా పెంచుకోవటం జరిగింది. కానీ ఉద్యోగస్తులు మాత్రం అంతంత మాత్రమే ఉండి చాలా డిప్రెషన్‌కు లోనై మిగతా అధికారులు చేసే పనులు కూడా అడిషనల్ ఛార్జ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెడుతుంది. ఉద్యోగస్తుల కొరతతో రాష్ట్రం నష్టపోతుంది. రాష్ట్రంలో శాసన సభ్యులు 119 మండలి సభ్యులు 40 లోక్‌సభ సభ్యులు 17 రాజ్యసభ సభ్యులు 7 కార్పొరేటర్లు 661 కార్పొరేషన్ మేయర్ లు 13 కౌన్సిలర్స్ 2849 మున్సిపల్ చైర్మన్లు 125 జెడ్ పి టి సి లు 538 జెడ్పీ చైర్మన్స్ 32 ఎంపీటీసీలు 5816 ఎంపీపీలు 537 సర్పంచులు 12769 జిల్లాలు పెరిగినప్పుడు ప్రజా ప్రతినిధులు నాయకులు 23 వేలకు పైగా పెరిగారు. అయినప్పటికిని సమతౌల్య సామాజిక జనహిత పరిపాలన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికీ చేత కావట్లేదు. బహుజన నాయకులు రాజ్యాధికారం వైపు అడుగులు వేయకపోతే జీవితాలు అంధకారం అవుతాయి. కేవలం జిల్లాలు మండలాలు పెంచడం ద్వారా ప్రజాప్రతినిధులను పెంచుకుని నేడు భూకబ్జా, ఇసుక దందా, రియల్ ఎస్టేట్ వ్యాపారం, రైస్ మిల్లుల దందా, మెడికల్ మాఫియా, ప్రాజెక్టులు నూతన బిల్డింగుల పేరుతో దోపిడీ మరియు బహుజనుల అంతంత మాత్రపు భూములను సైతం వదలకుండా విపరీతమైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజాధనాన్ని భూములను మానసిక సంతోషాలతో కూడిన జీవన మనుగడను ఈ రాష్ట్ర ప్రభుత్వం మభ్యపెడుతూ దందా చేసే మాఫియా లాగా వీరి వైఖరి ఉన్నది అని డాక్టర్ రామకృష్ణ మండిపడ్డారు.

