0 0
Spread the love

Read Time:2 Minute, 39 Second
మున్సిపాలిటీ కార్మికుల సమస్యలను పరిష్కరించండి
పెండింగ్లో ఉన్న పీఎఫ్ ఈ ఎస్ ఐ డబ్బులు చెల్లించాలి…………. ఏఐటీయూసీ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్యా డిమాండ్
ఏఐటీయూసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నగరి మున్సిపల్ కార్యాలయంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది, అనంతరం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు కోదండయ్యా మాట్లాడుతూ మున్సిపాలిటీలో పని చేయు కార్మికులకు కానీ కనీస వేతన 26 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులను ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పర్మినెంట్ చేయాలని, కార్మికుల నుంచి రికవరీ చేసిన ఈ ఎస్ ఐ పి ఎఫ్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసారు, ఈరోజు మున్సిపాలిటీ లో సుమారు 10 మంది పైన కార్మికులు చనిపోవడం జరిగింది. ఎంతవరకు వాళ్లకు పిఎఫ్ క్లైమ్ కాలేదు. వారి కుటుంబాల ఇబ్బందులు పడుతున్నాయి, కావున పి యు పి ఎస్ ఐ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులపై సచివాలయ కార్యదర్శుల బెదిరింపుల మానుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
అనంతరం నగిరి మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పీఎఫ్ ఈఎస్ఐ డబ్బులే నెలల్లో చెల్లిస్తామని కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి మురళి, ఏ ఐ టి యు సి నాయకులు భాషా విజయ్ కుమార్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు శేఖరు , మురుగామ్మా, సుబ్రమణ్యం దశరథం రాము ఏసుదాసు రాజేంద్ర ఎల్లమ్మ వెంకటమ్మ సంపూర్ణ పార్వతి మోహన కార్మికులు పాల్గొన్నారు

Spread the love
You cannot copy content of this page