
మరో పది రోజుల్లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్.. పొంగులేటీ సంచలన ప్రకటన
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 15 లోపే ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు.కులగణనపై ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక అందింది. ఈ నెల 4న అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్న తర్వాత ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి తొలి వారంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని పొంగులేటి హెచ్చరిచారు. అలాగే రాష్ట్రంలో అర్హులందరికీ పథకాలు అందుతాయని పేర్కొన్నారు. రెండు లేదా మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని చెప్పారు. ఇదిలాఉండగా.. రాష్ట్రంలో మొత్తం 12,845 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 1,13,328 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కులగణన కూడా పూర్తి చేసిన సంగతి తెలిసిందే.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app