SAKSHITHA NEWS

పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి గారు

షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల పరిధిలోని తీగాపూర్ గ్రామంలో సీతారామ చంద్ర పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ పూజ కార్యక్రమంలో పాల్గొని పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి , ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయన్ని ఘనంగా సన్మానించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా తీగాపూర్ గ్రామ ప్రజలపై మరియు షాద్నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ చల్లని ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఆంజనేయస్వామి చూడాలని ఆ భగవంతుని వేడుకున్నట్టు మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి తెలిపారు.. ఈ కార్యక్రమంలో కొత్తూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరినాద్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ జగన్మోహన్ రెడ్డి, నందిగామ మండల పార్టీ అధ్యక్షులు జంగ నర్శింలు, కృషయ్య యదయ్య, తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS