ఓరియంటేషన్ వర్క్ షాప్ 2022 ఆన్ పట్టణ ప్రగతి
సాక్షిత : MA &UD,IT,IND&C మంత్రి తారక రామారావు * ముఖ్య అతిథిగా, CDMA వారి అధ్యక్షతన వెంగల్ రావు నగర్ TSGENCO ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి పై ఓరియంటేషన్ వర్క్ షాప్ 2022 కార్యక్రమంలో *నిజాంపేట్ మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * కమిషనర్ వంశీ కృష్ణ తో కలిసి పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… ఈ నెల 20 నుండి జూన్ 5 వరకు నిర్వహించబడే పట్టణ ప్రగతి 2022 విధి విధానాలను వివరిస్తూ… పరిశుభ్రమైన పట్టణాలు వర్క్ షాప్ ఏర్పాటు ధోరణి, స్వచ్ఛ సర్వేక్షన్ 2022 ద్వారా మార్గదర్శకాల అమలు,హరిత హరం,శానిటేషన్, పబ్లిక్ టాయ్ లెట్స్,ఐటీసీ టూల్స్ ఫర్ గవర్నెన్స్,దోభి ఘాట్స్ నిర్మాణం,మానవ వ్యర్థాల శుద్దీకరణ,మున్సిపల్ ప్లానింగ్ ఇంటిగ్రేటెడ్ వెజ్,నాన్ వెజ్ మార్కెట్స్ ఏర్పాటు,వైకుంఠ ధామాలా నిర్మాణం,వాటి సుందరీకరణ,వంద శాతం నీటి సరఫరా, బయో మైనింగ్,పార్క్ ల అభివృద్ధి, టీఎస్ బీపాస్ చట్టం,అదే విధంగా కార్పొరేషన్ పరిధిలో నాటే వివిధ రకాలైన మొక్కలు వంటి పలు అంశాలను వక్తలు,అధికారులతో కలిసి వాఖ్యనించారు.
భాగంగా ఆయా రంగాల్లో ఉత్తమ సేవలను కనబరిచిన మున్సిపల్ కార్పొరేషన్ లకు అవార్డ్ లు ప్రధానం చేయడం జరిగింది.
ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్త అదనపు కలెక్టర్లు, మేయర్లు,కమిషనర్లు,మున్సిపల్ చైర్మన్లు,చైర్ పర్సన్ లు CDMA డైరెక్టర్ సత్యనారాయణ ఐఏఎస్,CDMA ఇతర ముఖ్య అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

