SAKSHITHA NEWS

విద్యార్థుల భవిష్యత్తు మెరుగుపడేందుకు ప్రేరణ, పోషక ఆహారం ఎంతో ముఖ్యమని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి డా. యం. ప్రియాంక అన్నారు.

  జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు  గట్టు మండలం మాచెర్ల ప్రభుత్వ పాఠశాలలో అమలు అవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి డా. యం. ప్రియాంక  ఆకస్మిక తనిఖీ చేశారు.

  ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ, జెడ్పీ హెచ్ ఎస్ మాచెర్ల ప్రభుత్వ పాఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రత్యేకంగా కెరీర్ గైడెన్స్, మోటివేషనల్ క్లాసులు నిర్వహించామన్నారు. విద్యార్థులకు ఎస్.ఎస్.సి. పరీక్షల్లో విజయం సాధించడానికి పాటించాల్సిన పద్ధతులు, మెలుకువలు వివరించారు. విద్యార్థులకు ఆశక్తిని పెంపొందిస్తూ, వారి భవిష్యత్తు గురించి స్పష్టతనిచ్చేలా ఉపన్యాసం అందించారు.

 అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. పాఠశాల వంట గదిని, స్టోర్ రూమ్ ను పరిశీలించి, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.  భోజనాలు వండటానికి ముందే ప్రతిరోజు సరుకుల నాణ్యతను పరిశీలించుకుని వంటకాలు చేపట్టాలన్నారు.  ఆహార నాణ్యత, పరిశుభ్రతపై సూచనలు అందించారు. వంటగది పరిశుభ్రతపే ప్రత్యేక శ్రద్ధ అవసరమని, విద్యార్థులకు మెరుగైన ఆహారాన్ని అందించడంలో ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. అలాగే తాగునీటి స్వచ్ఛతకు ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిందిగా పాఠశాల సిబ్బందికి సూచనలు చేశారు.

  ఈ కార్యక్రమంలో డి.సి.పి.ఓ  నర్సింహులు,ఎం.ఈ.ఓ  నల్లారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS