SAKSHITHA NEWS

తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్..!!

తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ (MLC Elections) నియోజకవర్గానికి ఎన్నికలకు నోటిఫికేషన్ షెడ్యూల్ ను (MLC Election Notification Schedule) ఎన్నికల సంఘం విడుదల చేసింది.

ఫిబ్రవరి 3న వీటికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కానుండగా ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనున్నది. ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా నల్గొండ-ఖమ్మం- వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ, కరీంనగర్ – మెదక్ – ఆదిలాబాద్- నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ, కరీంనగర్- మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల కోసం రాష్ట్రంలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు స్థానాలకు బీజేపీ (BJP) తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించగా అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ (Congress) కసరత్తు చేస్తోంది. బీఆర్ఎస్ (BRS) పోటీ విషయంలో ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

షెడ్యూల్:

నోటిఫికేషన్ విడుదల: 3 ఫిబ్రవరి 2025

నామినేషన్లకు చివరి గడువు: 10 ఫిబ్రవరి 2025

నామినేషన్ల పరిశీలన: 11 ఫిబ్రవరి 2025

నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు: 13 ఫిబ్రవరి 2025

పోలింగ్: 27 ఫిబ్రవరి 2025

పోలింగ్ జరిగే సమయం: ఉ.8 గంటల నుంచి సా.4 గంటల వరకు

కౌంటింగ్: 3 మార్చి 2025..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app