SAKSHITHA NEWS

నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలవాలి” – ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరేష్ తేజ

సాక్షిత వనపర్తి

నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలవాలి” అనే నినాదంతో శాంతియుతంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరేష్ తేజ మాట్లాడుతూ –

ప్రజాస్వామ్యం ద్వారా సమస్యలకు పరిష్కారం సాధ్యమని, హింస మార్గంలో దేశంలో ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారంకాలేదని స్పష్టం చేశారు. భారతదేశానికి స్వాతంత్రం అహింసా మార్గంలో వచ్చినట్లే, తెలంగాణ రాష్ట్రం కూడా ఉద్యమాలను ప్రజాస్వామ్యబద్ధంగా సాధించుకున్న దాఖలానే ఉంచారని పేర్కొన్నారు.

అర్బన్ నక్సలైట్ల రూపంలో మేధావులుగా యూనివర్సిటీల్లో చలామణి అవుతూ, పేద విద్యార్థుల అమాయకత్వాన్ని దుర్వినియోగం చేస్తూ అడవుల్లోకి మావోయిస్టు మార్గంలో నడిపించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వారి పిల్లలను విదేశాలకు పంపిస్తూ, ఇతరుల పిల్లలను తుపాకుల మార్గంలో ముంచడమొక దారుణమైన రాజకీయమేనని అన్నారు.

మావోయిజం ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి అడుగుపెట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్లు, పాఠశాలలు, వైద్య సదుపాయాల లేని గ్రామాలు నక్సలిజం వల్లే అని, ఇది అభివృద్ధి వ్యతిరేక సిద్ధాంతమని తెలిపారు.

నక్సలైట్లు చర్చల కోసం రాయబారాలు పంపించే ప్రయత్నాలు, తమ ఉనికి ప్రమాదంలో పడినప్పుడే మాత్రమే జరుగుతున్నాయని, నిజమైన శాంతికోరిక ఉంటే తుపాకులను వదిలి, ప్రజాస్వామ్యాన్ని అంగీకరించి రాజకీయాల్లో పాల్గొనాలని సూచించారు.

అంబేద్కర్ వాదాన్ని మావోయిజంతో కలిపి విద్యార్థులను మభ్యపెట్టే ప్రయత్నాలు ఖండనీయం. అంబేద్కర్ ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరిచారనీ, అదే మార్గంలో నడవాల్సిన అవసరం ఉందని నరేష్ తేజ స్పష్టం చేశారు.

మావోయిస్టులు తుపాకులు వదిలి ప్రభుత్వానికి లొంగి, ఒక రాజకీయ పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రావాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తలపోతోంది.

ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ సాతర్ల అర్జున్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివ కుమార్,కార్తీక్, బంటి, పవన్,వెంకీ,భాస్కర్, వినయ్, భాను మరియు తదితరులు పాల్గొనారు