నాగబాబుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చోటు
అమరావతి :
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగ బాబుకు ఏపీ కేబినెట్ లో చోటు దక్కింది, ఆయనను మంత్రివర్గంలోకి తీసుకో వాలని నిర్ణయించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్ల ప్రకారం 25 మందిని మంత్రివర్గంలోకి తీసుకునే వీలుంది. ప్రస్తుతం ఏపీ కేబినెట్‌లో 24 మంది మంత్రులు ఉన్నారు. ఇందులో జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రులుగా ఉన్నారు. బీజేపీ నుంచి ఒకరికి అవకాశం దక్కింది. ఇప్పుడు ఏపీ కేబినెట్‌లోకి నాగబాబును కూడా తీసు కున్నట్టు సమాచారం…
అయితే నాగబాబును రాజ్యసభకు పంపుతారనే ప్రచారం ఇటీవల జరిగింది. అయితే సోమవారం రాజ్యసభ అభ్యర్థుల ఖరారుతో ఆ ప్రచారానికి తెరపడింది. బీజేపీ నుంచి ఆర్. క్రిష్ణయ్య పేరు ఉద యం ఖరారు కాగా.. టీడీపీ నుంచి బీద మస్తాన్‌రావు, సానా సతీష్‌లను రాజ్య సభ అభ్యర్థులుగా ఖరారు చేశారు.
ఎన్నికల సమయంలో నాగబాబును అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని పవన్ కళ్యాణ్ భావించారు. సీటు ఇక నాగబాబుకే అన్న సమయంలో పొత్తుల లెక్కలకు తెరలేచింది. పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి వెళ్లింది.
టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కోసం అన్నయ్య సీటును పవన్ కళ్యాణ్ త్యాగం చేశారు. నాగబాబు కూడా కూటమి గెలుపునకు తన వంతు కృషి చేశారు. ఎన్నికల్లో గెలిచి టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక నాగబాబుకు కేబినెట్ లో చోటు దక్కింది.