SAKSHITHA NEWS

తుడా టవర్స్ నిర్మాణ పనులు పరిశీలించిన ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య.

తిరుపతి పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న తుడ టవర్స్ నిర్మాణ పనులను ఉదయం తుడ ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య అధికారులతో కలసి పరిశీలించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో టవర్స్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్మాణ పనుల పురోగతిపై అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ తుడ టవర్స్ ప్లాన్ ప్రకారం పనులు చేయాలని అన్నారు. నమూనా గది, ఏర్పాటు చేయనున్న మెటీరియల్ లో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని అన్నారు. ఫిబ్రవరి లోపు మోడల్ ప్లాన్, ఎగ్జిబిషన్ స్టాల్ నిర్మాణ పనులు పూర్తి చేస్తే వేలం నిర్వహించేందుకు వీలుంటుందని అన్నారు. ఆదిశగా అధికారులు అందరూ నిత్యం పనుల పర్యవేక్షణ చేయాలని అన్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో సెక్రటరీ వెంకట నారాయణ, కృష్ణా రెడ్డి, ఈ.ఈ.రవీంద్ర, నిర్మాణ సంస్థ ప్రతినిధి సుశీల్, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app