SAKSHITHA NEWS

కొంపల్లి వడ్డెర సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి : ఎమ్మెల్యే కి వినతిపత్రం…

పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద కొంపల్లి మున్సిపాలిటీ ఉమామహేశ్వర కాలనీ వడ్డెర సంఘం సభ్యులు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని కలిసి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తోడ్పాటునందించాలని వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ… గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కుల సంఘాలకు ప్రభుత్వ భూములను కేటాయించి ప్రత్యేక నిధులతో వారి అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని అన్నారు. కొంపల్లి ఉమామహేశ్వర కాలనీ వడ్డెర సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నా సహాయ సహకారాలు అందిస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షులు ఎత్తరి మారయ్య, కొంపల్లి ఉమామహేశ్వర కాలనీ వడ్డెర సంఘం సభ్యులు వల్లెపు అంజయ్య, మంజల వెంకయ్య, వల్లెపు మహేష్, బోసు సుధాకర్, కే.స్వామి, ఎస్.వెంకటేష్, ఓ.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.