
వడ్డేపల్లి, హన్మకొండ
రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కలిగి ఉండాలి. రోడ్డు భద్రతా అవగాహన సదస్సులో ఎం.ఎల్.ఏ. నయిన్ రాజేందర్ రెడ్డి..
ప్రతీఒక్కరు రోడ్డు భద్రతా నియమాల పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ రోజు పింగిలి డిగ్రీ కాలేజీ లో జరిగిన రోడ్డు భద్రత అవహాహన కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ శాసస సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
నెహ్రు యువ కేంద్ర, ట్రాఫిక్ పోలీస్ మరియు రోడ్ ట్రాన్స్ పోర్ట్ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించిన రోడ్డు భద్రత అవహాహన కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా సుభాష్ చంద్రబోసు జయంతి సందర్భంగా అయన చిత్రపటానికి మరియు స్వామి వివేకానంద స్వామి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…
ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాల పట్ల అవహాన కలిగి ఉండాలి
ప్రమాదాల నివారణకు ప్రజలంతా రహదారి భద్రత పాటించాలని విద్యార్థులకు సూచించారు.
విద్యార్థులు వేగ నియంత్రణతో వాహనాలు నడిపితే రహదారి ప్రమాదాల నివారణ జరుగుతుందన్నారు.
నిమిషానికి ఒక యాక్సిడెంట్ లో ఒకరు మృత్యువాత పడుతున్నారు.
వాహనాలు నడిపినప్పుడు హెల్మెట్, సీటు బెల్ట్ ధరించాలన్నారు.
పౌరులందరూ రోడ్డు భద్రతా నియమాలకు కట్టుబడినప్పుడే ప్రమాదాలు అరికట్టవచ్చన్నారు.
రోడ్డు భద్రత అనేది క్లిష్టమయిన సమస్య అది రోజు వారి జీవితాలను ప్రభావితం చేస్తోంది. దీనిని పరిష్కరించడానికి అవగాహన కల్పించడానికి మరియు సురక్షమైన పద్దతులను ప్రోత్సహించడానికి ఇలాంటి మరెన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, రెడ్ క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యుడు ఈ.వి. శ్రీనివాస్ రావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, డి.టి.సి. పుప్పాల శ్రీనివాస్, పింగిలి కాలేజీ ఇంచార్జి ప్రిన్సిపాల్ సుహాసిని, డాక్టర్ రామకృష్ణా రెడ్డి, పలువురు సి.ఐ. లు తదితరులు పల్గోన్న్నారు.
