పర్వత్ నగర్ లోని ముస్లిం స్మశాన వాటిక

Spread the love
Muslim graveyard in Parvat Nagar

సాక్షిత : 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సభిహా గౌసుద్దిన్ పర్వత్ నగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పర్వత్ నగర్ లోని ముస్లిం స్మశాన వాటిక లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు

,అలాగే స్థానికులు బస్తి లో డ్రైనేజ్ చిన్నగా ఉందని అందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని కొత్త డ్రైనేజ్ లైన్ వేయాలని పిర్యాదు చేయగా వారి పిర్యాదు కి కార్పొరేటర్ సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరలో సమస్య ని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బస్తి ప్రెసిడెంట్ బాబా షరీఫ్, డివిజన్ మహిళ ప్రెసిడెంట్ పార్వతమ్మ, టి.ఆర్. ఎస్ రాజు, వర్క్ ఇన్స్పెక్టర్ వినాయక్ రావు, రేవతి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page