
పురపాలక సంగం దుండిగల్, మున్సిపాలిటీ కార్యాలయం నందు చివరి సర్వ సభా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్బంగా కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి ని
చైర్పర్సన్ సుంకరి కృష్ణవేణి కృష్ణ వైస్ చైర్మన్ పద్మరావు చేతుల మీదుగా సత్కరించడం జరిగింది ఈ సందర్బంగా చైర్మన్ కృష్ణవేణి కృష్ణ మాట్లాడుతూ మొత్తం మీద నీ పనులయితే పోరాడి సాధించుకున్నావ్ అని నవ్వుతూ అన్నారు,
బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ పార్టీ ఏదైనా ప్రజాస్వామ్య ప్రజా క్షేత్రం లో అధికార పార్టీ లోనే ఉండాలి అని ఏమి లేదు పోటీ చేసే నాయకునికి పార్టీ సిద్ధాంతం పట్ల అభిమానం ఉండాలి ప్రజా సమస్యలు, అవసరాలపై అవగాహన ఉండాలి,విజ్ఞప్తి చేయాలి కుదరకపోతే అవసరం ఐతే తెగించి పోరాడి సాధించుకోవాలి,అంతే కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు వ్యక్తి గతంగా కొంత ఉంటే పార్టీ అభిమానులు,కార్యకర్తల కృషి కూడా ఎంతో ఉంటుంది. ఎన్నో వత్తిళ్ళు వచ్చిన నా పార్టీ నేర్పిన సిద్ధాంతం కార్యకర్తల కృషి నిలబడి పోరాడి అన్నింట్లో గెలవడం జరిగింది. రాజకీయం అంటే అది నాయకునికి కేవలం పదవి అలంకరణ కోసం మాత్రమే కాదు, ఆస్తులు సంపాదించుకోవడం కోసం కాదు, దేశం,సంస్కృతి, సమాజం పట్ల భక్తి భావన ఉండాలి నిరంతరం దేశానికి ప్రజా సమస్యలకు ఏదో ఒకటి చేయాలి అనే తపన ఉండాలి అని నాకు ఆర్ఎస్ఎస్ నేర్పిన సిద్ధాంతం
ప్రతి నిత్యం ప్రజలలో ఉండాలి కానీ వారి సమస్యలు వచ్చినప్పుడు ఇంటి చుట్టూ తిప్పించుకోవడం తప్పించుకొని తిరగడం కాదు ఆర్థిక సహాయం చేయకపోయినా పర్వాలేదు సమస్య వచ్చినప్పుడు వారికి అర్థం అయ్యేలా వారి వద్దకే వెళ్లి సమస్య పరిష్కరించాలని నేను నేర్చుకున్న ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటూ మా పదవి కాలం లో మీ సమస్య తీరిపోవాలని తపించి మెప్పించే ప్రయత్నం చేయడం జరిగింది.
కరోనా మరియు ఎలాంటి ఇతర వ్యాధుల ప్రభలే సమయంలో, అధిక వర్షాల సమయంలో,రోడ్లు,మంచి నీళ్లు,హిందూ సంస్కృతి, అనేక ఆసుపత్రిల హెల్త్ క్యాంపు లు,నిత్యావసరాలు,వంటి ఇతర అనేక సమస్యల విషయంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ, అన్ని విషయాలలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు అదృష్టంగా భావిస్తున్నాను
ప్రజా సేవ చేసుకునే అవకాశం కల్పించిన భారతీయ జనతా పార్టీ కి, నను నమ్మి మాకు ఇంత బారి మెజారిటీ ఇచ్చి గెలిపించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ
ఇట్లు
మీ కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి
పీసరి కృష్ణారెడ్డి బీజేపీ దుండిగల్ మున్సిపల్ అధ్యక్షులు
