
ముగ్గులు భారత స్త్రీల హస్తకళకు ప్రతిబింబాలు జిల్లా ఎస్పీ**
రావుల గిరిధర
- సాక్షిత వనపర్తి
ముగ్గులు భారతీయ మహిళల హస్తకళా నైపుణ్యానికి ప్రతిబింబాలని జిల్లా ఎస్పీ *రావుల గిరిధర్ అన్నారు.
సంక్రాంతి సంబరాలలో భాగంగా జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జనమైత్రి క్రీడలలో భాగంగా జిల్లాలో మహిళలకు ముత్యాల ముగ్గుల పోటీని ఎస్పీ కార్యాలయం క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. భారతీయుల సంస్కృతి సాంప్రదాయంలో ముగ్గులది ప్రధానమైన పాత్ర అని ఆయన వివరించారు.ఎలాంటి సాధనాలు ఉపయోగించకుండా మన మహిళలు మునివేళ్లతో వేసే ముగ్గులను ప్రపంచంలోని స్త్రీలంతా ఆశ్చర్యంగా చూస్తారని ఎస్పీ వివరించారు.అనాదిగా వస్తున్న ఈ కళలను ప్రోత్సహిస్తూ కాపాడుకోవాలని ఆయన పేర్కొన్నారు.ఎస్పీగ) సతీమణి శ్రీమతి అపర్ణ కుటుంబ సభ్యులతోపాటు పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇతర ప్రాంతాలవారు ఉత్సాహంగా పాల్గొన్నారు.విజేతలకు ఎస్పీ బహుమతులు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్పి సతీమణి శ్రీమతి, అపర్ణ , డిసిఆర్బి డిఎస్పి, ఉమామహేశ్వర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, శ్రీనివాస్, అప్పలనాయుడు, మహిళ ఎస్సైలు, మహిళ, కానిస్టేబుల్, మరియు కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
