SAKSHITHA NEWS

రైల్వే గెట్లపై ఫ్లె ఓవర్ నిర్మాణ పనులను పరిశీలించిన…..ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

నిర్లక్ష్యానికి తావు లేకుండా నిర్మాణ పనులను వేగవంతం చెయ్యాలి:ఎంపీ బాలశౌరి

నిర్మాణ పనుల జాప్యంతో ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తే సహించేది లేదు: ఎమ్మెల్యే రాము

గుడివాడ :గుడివాడ పట్టణం పామర్రు రోడ్డులో జరుగుతున్న రైల్వే గేట్లపై ప్లే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఎంపీ వల్లభనేని బాలసౌరి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధికార యంత్రాంగంతో కలిసి పరిశీలించారు.

సందర్భంగా ప్లే ఓవర్ నిర్మాణ పనుల పురోగతిని నేషనల్ హైవే డి.ఈ సత్యనారాయణ…..
ఎంపీ బాలసౌరి, ఎమ్మెల్యే రాముకు వివరించారు. ఈ సందర్భంగా మందకొడిగా నిర్మాణ పనులు జరగడానికి కారణమెంటని కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించారు.

నిర్మాణ పనుల ఆలస్యం కారణంగా వాహనదారులకు ట్రాఫిక్ తో,ప్రజలు విద్యుత్, త్రాగునీటి సమస్యలను ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే రాము ఆగ్రహం వ్యక్తం చేశారు…. మార్చి నేలాఖరులోపు నిర్మాణ పనులు తుది దశకు వస్తాయని కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు ఎమ్మెల్యే, ఎంపీకు చెప్పారు.

ప్లే ఓవర్ నిర్మాణానికి ఉన్న స్థల సేకరణ మరియు ఇతర కొద్దిపాటి సమస్యలను పరిష్కరించి….. నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా ఎంపీ బాలసౌరి తెలియజేశారు.

కేవలం కొందరి నిర్లక్ష్యంతో వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడటం సరికాదని….. కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్మాణ పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాల మురళీకృష్ణ,మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్,మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు,అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ,బిజెపి ఇంచార్జ్ దావులూరి సురెంద్రబాబు, మున్సిపల్, రెవెన్యూ, మరియు నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS