
మహాశివరాత్రి వేడుకల్లో ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు వివిధ ప్రాంతాల్లో గల శివాలయాలను ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కి ఆలయ పండితులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ పరమశివుడి కరుణాకటాక్షాలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, పాడిపంటలతో ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని పరమశివుడిని కోరుకున్నట్లు ఎమ్మెల్సీ తెలుపుతూ ప్రజల అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app