
ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
పోలింగ్ సరళీని పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య
(ఉమ్మడి వరంగల్ జిల్లా జోనల్ ఇంచార్జీ)
వరంగల్ ఖమ్మం నల్లగొండ ఉపాధ్యాయ శాసన మండలి నియోజక వర్గానికి సంబంధించి జరిగిన ఎన్నికలకు హనుమకొండ జిల్లాలో గురువారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.
జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు 15 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ సాగింది. హనుమకొండ లోని యూనివర్సిటీ లా కాలేజీ కాకతీయ డిగ్రీ కళాశాల లోని పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ పి. ప్రావిణ్య సందర్శించి పోలింగ్ సరళీ గురించి పోలింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాలలో సాగుతున్న పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పరిశీలించారు.
వరంగల్ ఖమ్మం నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజక వర్గానికి సంబంధించి జిల్లాలో 5215 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా ఇందులో 4780 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి 91.66 ఓటింగ్ శాతం నమోదయింది. అదే విధంగా మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజక వర్గానికి సంబంధించి జిల్లాలోని నాలుగు మండలాలైన భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్, వేలేరు మండలాల్లో 166 ఓట్లు ఉండగా 103 మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఈ మండలాల్లో 62.05 శాతం ఓటింగ్ నమోదయింది. మెదక్, నిజామాబాద్,, ఆదిలాబాద్, కరీంనగర్ పట్ట భద్రుల నియోజక వర్గానికి సంబంధించి జిల్లాలోని నాలుగు మండలాలైన భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్, వేలేరు మండలాల్లో 4585 మంది ఓటర్లు ఉండగా 1780 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 38.82 ఓటింగ్ శాతం నమోదయింది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app