
నర్సింగ్ కళాశాల స్వాగత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి ..
గద్వాల జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలలో మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందిన విద్యార్థులకు స్వాగత కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి హాజరయ్యారు.
మొదటగా కళాశాల ప్రిన్సిపల్, బండ్ల జ్యోతి కి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు..
నర్సింగ్ కళాశాలలో నూతన విద్యార్థినిలు ప్రవేశం పొందిన సందర్బంగా ఎమ్మెల్యే సతీమణి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్యే సతీమణి మాట్లాడుతూ….
నూతన విద్యార్థులకు వారిని ఆహ్వానిస్తున్న అధ్యాపకులకు, పై తరగతుల విద్యార్థులకు శుభాకాంక్షలు
నాకు చాలా ఆనందంగా ఉంది నా కాలేజీ రోజులు గుర్తుకొస్తున్నాయి నేను కాలేజ్ మొదటి రోజుల్లో చాలా బెరుకుగా ఉండేదాన్ని తర్వాత నాకు మార్వాలేని ఆనందాలను అనేదించాయి అని
కాలేజి రోజులు చాలా విలువైన రోజులు మన జీవితాన్ని మలుపు తిప్పే రోజులు
మనం కాలేజీ రోజులను ఎంత గొప్పగా వాడుకుంటే మన జీవన ప్రయాణం అంత గొప్పగా సాగుతుందని
ఈ కాలేజీ సమయాలను వృధా కాకుండా చాలా జాగ్రత్తగా ఉపయోగించుకొని ఉన్నతంగా జీవితాన్ని మలుచుకోవాలని
మన అధ్యాపకులు, మన సీనియర్ ల నుండి చాలా నేర్చుకొనే రోజులు వాళ్ళు వల్ల అనుభవాలతో మనకు మంచి చేసే ఆలోచనతో ఉంటారు కాబట్టి వాళ్ళు చేప్పేవి మనం మన జీవితానికి ఆణువహించుకొని ముందుకు సాగాలి
తాత్కాలిక ఆనందాలకోసం సమయం వృధా కాకుండా చూసుకోవాలని భవిష్యత్తుకు బంగారు బాటను ఏర్పర్చుకొని సాగిపోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జమ్ములమ్మ ఆలయ కమిటీ డైరెక్టర్లు రాధారెడ్డి, మధుమతి నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
