SAKSHITHA NEWS

ఐనవోలు మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాగరాజు …

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించే పెద్ద పట్నం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు ….

హనుమకొండ జిల్లా ఐనవోలు మండల పరిధిలోని ఐనవోలు మల్లికార్జున స్వామి వారిని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన స్వామి వారి ఆశీస్సులు పొందిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ….

అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఎమ్మెల్యే నాగరాజు ని ఆశీర్వచనం అందించారు…

అనంతరం ఆలయ ప్రాంగణలో మహా శివరాత్రి పర్వదినం నిర్వహిస్తున్న పెద్ద పట్నం కార్యక్రమంలో పాల్గొన్నారు….

తదనంతరం మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం చేసిన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పరిసర ప్రాంతాలను స్వయంగా తిరుగుతూ పర్యవేక్షించారు….

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ:-….

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మనం అందరికి అన్నదానం చేయడం ఒక గొప్ప సంప్రదాయం. భక్తులకు ఆహారం అందించడం, వారి కష్టాలను తీర్చడం మన బాధ్యత. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు తేవాలని మనం ఇక్కడ వచ్చాం. శివరాత్రి రోజు ఒక పుణ్యకార్యంగా, అందరూ భక్తిశ్రద్ధలతో ఉండాలని, ప్రజలు ప్రతి ఒక్కరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాం అని చెప్పారు..

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app