SAKSHITHA NEWS

సచివాలయ ఉద్యోగులకు ఎమ్మెల్యే సోమిరెడ్డి స్పెషల్ క్లాస్

పేదలకు ప్రయోజనాలు కలిగించే విషయంలో నిర్లక్ష్యం వీడాలని సూచన

గిరిజనుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు ఒకరితో ఒకరు సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపు

ఫిబ్రవరి 15 లోపు ప్రతి ఉద్యోగి ఇంటింటికీ వెళ్లి ఆధార్, రేషన్ కార్డులు లేని వారితో పాటు అర్హత ఉన్నా ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్న వారి వివరాలను సేకరించాలని ఆదేశం

సచివాలయ వ్యవస్థ వచ్చి ఐదేళ్లవుతున్నా, ఒక్కో సచివాలయంలో 10 మంది ఉద్యోగులుంటున్నా కనీసం ఆధార్ కార్డులు కూడా ఇప్పించలేని పరిస్థితులు ఉండటంపై ఆవేదన

విధినిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని హెచ్చరిక

పంచాయతీ కార్యదర్శులు కూడా నిర్లక్ష్యాన్ని వీడి ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని సూచన

సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని వెల్లడి

సచివాలయ ఉద్యోగులను ఇబ్బందిపెట్టే ఉద్దేశం తనకు లేదని, చిన్నవయస్సులో ఉద్యోగాల్లో చేరిన వారంతా తనకు బిడ్డలతో సమానమని, బాధ్యతగా పనిచేయాలని మాత్రమే చెబుతున్నానని స్పష్టీకరణ

మనుబోలులోని చేరెడ్డి రామచంద్రారెడ్డి కళ్యాణ మండపంలో మండలంలోని అన్నిసచివాలయాల ఉద్యోగులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app