SAKSHITHA NEWS

పెదముషిడివాడ పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలలో ఎమ్మెల్యే పంచకర్ల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలంలో పల్లె పండగ-పంచాయతీ వారోత్సవాలు నిర్వహించడం జరిగినది.ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా పరవాడ మండలం పెదముషిడివాడ గ్రామపంచాయతీ కన్నూరు గ్రామపంచాయతీ తానం గ్రామపంచాయతీ భరిణికం గ్రామ పంచాయతీ,పరవాడ గ్రామపంచాయతీ వెన్నెలపాలెం గ్రామపంచాయతీ గొల్లవానిపాలెం గ్రామ పంచాయితీ,మరియు పి బోనంగి గ్రామ పంచాయతీలలో లో పల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు వీరితో పాటు పరవాడ మండలం ఎంపీడీవో , ఎమ్మార్వో ,పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన డీఈ , ఏఈ గ్రామ పంచాయతీల సెక్రటరీలు,సర్పంచులు ఎంపీటీసీలు మాజీ జడ్పిటిసి సభ్యులు,మాజీ ఎంపీటీసీ సభ్యులు,మూడు పార్టీలకు సంబంధించిన మండల పార్టీ అధ్యక్షులు,గ్రామ పెద్దలు, గ్రామ సీనియర్ నాయకులు మరియు పరవాడ మండలం ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ యొక్క పల్లి పండగ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS