SAKSHITHA NEWS

అశ్వారావుపేట

మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు సమీక్ష సమావేశం నిర్వహించిన MLA మెచ్చా

అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చెయ్యాలి

ప్రజలకు ఏలాంటి ఇబ్బంది లేకుండా చూడడం మన బాధ్యత

అశ్వారావుపేటలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మండల సర్పంచ్ లు,కార్యదర్శులతో మరియు మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు. ఈ సందర్భంగ అధికారులతో ఆయన మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో మంచి నీటి సమస్య ఉందని తెలియజేయగా దానికీ స్పందించిన ఎమ్మెల్యే మిషన్ భగీరథ మరియు ఇంట్ర అధికారులను వివరణ అడిగి తెలుసుకున్నారు,అలాగే బచ్చువారగూడెం గ్రామంలో నీటి సమస్య ఉందని తెలియజేసిన సంబందిత అధికారులు స్పందించలేదని స్థానిక సర్పంచ్ కార్యదర్శి తెలియజేయగా ఎమ్మెల్యే వెంటనే ఎదైనా సమస్య ఉందని తెలవగానే తక్షణమే స్పందించల్సిన అవసరం అందరి పై ఉందని.సమస్యను పరిష్కరించడం మన అందరి బాధ్యత అని.

అధికారులకు ఎదైనా ఇబ్బందీ అంటే వెంటనే నా దృష్టికి తీసుకువస్తే మీ పై అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని.ఈ వేసవి కాలం ఎక్కడ కూడా నీటి సమస్య రాకూడదని.అలాగే మన అశ్వారావుపేట మండలం చాలా పెద్ద మండలం ఎక్కువగా గిరిజన గ్రామాలు ఉండడంతో ప్రతి గ్రామానికి నీరు వెళ్లడం కొంచెం ఇబ్బందీ అవుతుందని ఐనా సరే ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తూ గ్రామాలలో ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు.అనంతరం పలువురు సర్పంచ్ లు,కార్యదర్శులు పలు సమస్యలపై ఎమ్మెల్యే కు వినతీ పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో అయనతో పాటు అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి.శ్రీరామమూర్తి, zptc చిన్నంశెట్టి.వరలక్ష్మి, దమ్మపేట జెడ్పీటీసీ పైడి వేంకటేశ్వరరావు, మండల సర్పంచ్ లు,కార్యదర్శులు, మిషన్ భగీరథ మరియు గ్రిడ్ అధికారులు డిఇ గారు ae లు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS