SAKSHITHA NEWS

అయ్యప్ప కాలనీ అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

125 – గాజులరామారం డివిజన్ మెట్ కాని గూడా అయ్యప్ప కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు కుత్బుల్లాపూర్ సంక్షేమ ప్రదాత, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి కాలనీలోని పార్కును సుందరీకరిస్తూ అభివృద్ధి పరచాలని కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గం లోని అన్ని డివిజన్లను కోట్లాది రూపాయలతో అభివృద్ధి పరచామని, అదేవిధంగా ఈ పదేళ్ల కాలంలో మెట్ కాని గూడ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి పరిచామన్నారు. రానున్న రోజుల్లో కాలనీ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు.

ఈ కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, సంక్షేమ సంఘం సభ్యులు రవిశంకర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, సిహెచ్. పూర్ణ, నరేంద్రనాథ్ సర్కార్, బి. రాజేశ్వర్, ఏ. ఆర్ సి రెడ్డి మోహన్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, రవికుమార్ గియ్యర్, ఆనంద్, జయరాం, కిరణ్ పంతులు తదితరులు పాల్గొన్నారు.