ఉద్యమకారులను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Spread the love

MLA Goodem Mahipal Reddy takes care of the activists

ఉద్యమకారులను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో నివాసముండే J మహేశ్వర్ ఉద్యమకారుడు ఫిట్స్ వచ్చి కిందపడి తలకు బలమైన గాయమై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఇట్టి విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి అన్నారం స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలియజేయడం జరిగింది. ఇట్టి సంఘటన గురించి తెలిసిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాస్పిటల్ ఖర్చుల కోసం 20000 తక్షణ సాయంగా సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ద్వారా ఆర్థిక సాయం చేయడం జరిగింది.

ఇట్టి 20000 రూపాయలను మహేశ్వర్ మరియు వారి కుటుంబ సభ్యులకు హాస్పిటల్ కి వెళ్లి అందచేయడం జరిగింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ఆదుకున్నందుకు ఉద్యమకారుడు జె మహేశ్వర్ మరియు వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి కి మరియు అన్నారం టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ తుపాకుల రాజు వార్డు సభ్యులు నరహరి శేఖర్ నాయకులు వెంకటరెడ్డి నాగేష్ కిషన్ లక్ష్మణ్ మరియు గ్రామ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page