నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించిన ఎమ్మెల్యే

Spread the love
MLA Goodem Mahipal Reddy who provided financial assistance to a poor family

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించిన – ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామంలో చింతల మల్లేష్ టైఫాయిడ్ జ్వరంతో ఉండడంవల్ల అనారోగ్యానికి గురి అయిన విషయాన్ని తెలుసుకున్న పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వెంటనే ఈ విషయం తెలియగానే స్పందించి ఆ యొక్క పేద కుటుంబానికి తక్షణమే వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది.

ఏ పేద కుటుంబం కూడా అనారోగ్యానికి గురై కష్టాల్లో ఉన్న సమయంలో తప్పకుండా నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది.


ఈ యొక్క కార్యక్రమంలో నల్లవల్లి సర్పంచ్ దోమడుగు శంకర్ , గుమ్మడిదల సోషల్ మీడియా అధ్యక్షుడు ఫయాజ్ షరీఫ్ , టీఆర్ఎస్వీ అధ్యక్షుడు కానోజి రాము , మాజీ సర్పంచ్ శ్రీనివాస్ ముదిరాజ్ , నల్లవల్లి యూత్ అధ్యక్షుడు దిలీప్ గౌడ్ , టిఆర్ఎస్ నాయకులు బాలయ్య , జైపాల్ , చోటు మియా , సాయి , భార్గవ్ , గణేష్ , పసుల కుమార్ నల్లవల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు పెద్దంగాల మహేష్ కొంతమంది టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page