లక్డారం లో పర్యటించిన ఎమ్మెల్యే జిఎంఆర్

Spread the love

MLA GMR visited Lakdaram

లక్డారం లో పర్యటించిన ఎమ్మెల్యే జిఎంఆర్

సాక్షిత పటాన్చెరు : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండల పరిధిలోని లక్డారం గ్రామంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పర్యటించారు.

ఈ సందర్భంగా గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుని, ఆలయంలో చేపడుతున్న ప్రాకారం, గోపురం నిర్మాణ పనులను పరిశీలించారు.

అనంతరం గ్రామపంచాయతీ నూతన భవనం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవన నిర్మాణాలను పరిశీలించారు. నిర్దేశించిన సమయంలో గా పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఎమ్మెల్యే జిఎంఆర్ వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, గ్రామ ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page