SAKSHITHA NEWS

లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ క్యాంప్ లో రక్తదానం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర

కనిగిరి సాక్షిత

కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలోని సత్యనారాయణ స్వామి దేవస్థానంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని శనివారం టిడిపి మండల పార్టీ అధ్యక్షులు పువ్వాడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, కీర్తిశేషులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు, సినీరంగంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ గా పేరుగాంచి, రాజకీయాలలో మకుటం లేని మహారాజుగా, తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడు అని ఉభయ తెలుగు రాష్ట్రాలలో మండల వ్యవస్థను స్థాపించి, రెవెన్యూ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువ అయ్యేలా చేసిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని, సంక్షేమ పథకాలు, రెండు రూపాయలకే కిలో బియ్యం ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో పామూరు మండల టిడిపి అధ్యక్షులు పువ్వాడి వెంకటేశ్వర్లు, బిజెపి నియోజకవర్గ కన్వీనర్ కొండశెట్టి వెంకటరమణయ్య, జనసేన జిల్లా కార్యవర్గ సభ్యులు యలమందల రహీముల్లా ,టిడిపి పామూరు పట్టణ అధ్యక్షులు షేక్ ఖాజా రహమతుల్లా, మండల టిడిపి నాయకులు యారవ శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ డివి మనోహర్, అడుసుమిల్లి ప్రభాకర్, బొల్లా నరసింహారావు, ఇర్రి కోటిరెడ్డి, మొబీనా మౌలాలి,ఫత్తు మస్తాన్, మెంటా నరసింహారావు, తదితర టిడిపి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.