SAKSHITHA NEWS

అభివృద్ధికి అడ్డు చిన్నారెడ్డి అని ఆరోపించడం ఎమ్మెల్యే మెగా రెడ్డి అవగాహన రాహిత్యమే

పార్టీకి వ్యతిరేకంగా నిరంజన్ రెడ్డితో కలిసి కుట్ర చేస్తున్నాడుఅన్న ఆరోపణలకు సాక్షాలు ఉంటే బయటపెట్టాలని ఎమ్మెల్యేకు, చిన్నారెడ్డి సవాల్

46 ఏళ్ల రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీకె అంకితం, తప్పుడు ఆరోపణలు ప్రచారాలు మానుకోవాలని ఎమ్మెల్యేకు హితవు

ఒకటే పార్టీ వారి మధ్య సమన్వయం లోపిస్తే ఫలితాలు వేరుగా ఉంటాయి

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే వారికే పార్టీ టికెట్లు ఇవ్వాలని సూచన

సాక్షిత వనపర్తి
40 ఏళ్లకు పైగా తన రాజకీయ జీవితంలో 8 సార్లు వనపర్తి నియోజకవర్గం నుండికాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా కొనసాగిన సమయంలో వనపర్తి నియోజకవర్గాన్నికి ఎన్నో విద్యాసంస్థలను తీసుకువచ్చి విద్యా హబ్బుగా మార్చడం జరిగిందని ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకువచ్చి అభివృద్ధిని చేయడంతో పాటురామానంద తీర్థ లాంటి ప్రైవేటు సంస్థలను తీసుకొచ్చి నియోజకవర్గంలోని యువతకు మహిళలకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడంతో పాటు ఉపాధిని కల్పించడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనల కోసం శనివారం విచ్చేసిన మంత్రి పర్యటనలో భాగంగా గోపాల్పేట మండలం తన సొంత మండలములో నూతనంగా ఏర్పాటు చేయబోయే మార్కెట్ యార్డ్ విషయంలో మండల కేంద్రంలో కాకుండా పోలికపాడు గ్రామ శివారులలో ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం మార్కెట్ యార్డ్ ను ఎక్కడో ఏర్పాటు చేయడం వల్ల మండల రైతులకు ఇబ్బందికరంగా మారుతుందని అందుకే మండల హెడ్ క్వార్టర్ లోనే మార్కెట్ యార్డ్ ను ఏర్పాటు చేయాలని శిలాఫలకం ఏర్పాటు అడ్డుకోవడం జరిగిందని దీన్ని ఆసరాగా చేసుకున్న ఎమ్మెల్యే, ఆయన అనుచరులు మీడియాలో సోషల్ మీడియాలో చిన్నారెడ్డి అభివృద్ధికి అడ్డుపడుతున్నాడని విష ప్రచారాన్ని ఆదివారం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో ఎమ్మెల్యే మెగా రెడ్డి ఆయన అనుచరుల తీరు పై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి మండిపడ్డారు ఇది ఎమ్మెల్యే అవగాహన రాహిత్యమని అసలు నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఏం చేశారోl సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ రాలేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తో కలిసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తన ఓటమికి చిన్నారెడ్డి కుట్ర చేశాడని నియోజకవర్గ నుంచి ఢిల్లీ దాకా విష ప్రచారం చేయడం వల్ల తనకు రావాల్సిన మంత్రి పదవి రాలేదని కానీ అధిష్టానం తన నిజాయితీని గుర్తించి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవిని ఇవ్వడం జరిగిందన్నారు మెగా రెడ్డి ఓటమికి నిరంజన్ రెడ్డితో కలిసి కుట్ర చేశాడన్న ఆరోపణలు కాకుండా సాక్షాలు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని ఎమ్మెల్యే మెగా రెడ్డికి చిన్నారెడ్డి సవాల్ విసిరారు నిరంజన్ రెడ్డి అవినీతిపరుడు అహం బావి అని అందుకే తనకు అతను అంటే ఇష్టముండదని ఆయన మాతృమూర్తి మరణించిందని తెలిసి కనీసం పరామర్శించడానికి వెళ్ల లేదన్నారు కేవలం మిగిలిపోయిన అభివృద్ధి పనుల వివరాలు తెలుసుకునేందుకు ఒకటి రెండు సార్లు నిరంజన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడడం జరిగిందని చెప్పుకొచ్చారు దేశంలో నీతి నిజాయితీ కలిగిన ఏ కె ఆంటోనీ లాంటినాయకులు కొద్ది ముందే ఉన్నారని వారిలో తాను ఒకడినని అలాంటి తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని చిన్నారెడ్డి అన్నారు
టిడిపి, బిఆర్ఎస్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలకు మారిన మీకు ఆ పార్టీలలో మీకున్న విలువ ఏంటో అందరికీ తెలుసు అని కానీ తాను విద్యార్థి దశ నుండే కాంగ్రెస్ పార్టీలో చేరి దాదాపుగా 46 సంవత్సరాలుగా ఇదే పార్టీలో కొనసాగుతున్నానని తన ప్రస్థానం అంతం కాంగ్రెస్ పార్టీయే అని ఉద్వేగంతో తెలిపారు పార్టీ తనకు టికెట్ ఇవ్వలేదని ఒకవేళ ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉంటే ఈ మెగా రెడ్డి ఎక్కడుండేవాడని అసెంబ్లీ ఎన్నికల్లో నిరంజన్ రెడ్డి పై 25 వేల మెజార్టీతో గెలిచిన తర్వాత వచ్చిన ఎంపీ ఎన్నికల్లో ఐదు వేల మెజార్టీకే ఎందుకు పడిపోయిందో తెలపాలన
ప్రశ్నించారు తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో బుగ్గ కారులో నేనెప్పుడో తిరగలేదని పోలీస్ శాఖను ఎమ్మెల్యే ఇంటి చుట్టూ తిరిగేలా కావలికారులుగా మార్చార ని తను కేసు పెట్టమంటే కేసు పెట్టాలి లేదంటే లేదు అన్న చందంగా తయారు చేశారని ఇలాంటి పరిస్థితి వనపర్తిలో ఎప్పుడూ లేదని మొదటిసారి టిఆర్ఎస్ హయాంలో జరిగిందని దాన్ని ప్రస్తుతం ఎమ్మెల్యే కొనసాగిస్తున్నారని అన్నారు చిన్నారెడ్డి అభివృద్ధికి ఆటంకం కాదని అభివృద్ధి పేరుతో జరిగే అవినీతికి వ్యతిరేకి అని నియోజకవర్గ అభివృద్ధికి ఎవరు పాటుపడిన వాళ్లకు కాళ్లకు దండం పెట్టి స్వాగతిస్తానని చిన్నారెడ్డి అన్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలు పై టిఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కరపత్రాలద్వారా సంక్షేమ పథకాల అమలుపై ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని సీఎంకు సూచించినట్లు తెలిపారు
ఒకే పార్టీలో ఉంటూ సమన్వయ లోపంతో విమర్శలు చేసుకుంటూ ఉంటే ఫలితాలు వేరుగా ఉంటాయని రానున్నస్థానిక సంస్థల ఎన్నికలో గెలిచే వారికి పార్టీ టికెట్లు ఇవ్వాలని చిన్నారెడ్డి సూచించారు ఈ కార్యక్రమంలో బి కృష్ణ రాజేంద్రప్రసాద్ యాదవ్ కిరణ్ కుమార్ నారాయణ నాయుడ రాగి వేణు బాబా జిల్లా నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app