సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లను పరిశీలించిన మంత్రి పువ్వాడ

Spread the love

Minister Puvwada examined the integrated veg and non-veg markets

సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లను పరిశీలించిన మంత్రి పువ్వాడ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం నగరం వీడిఓస్ కాలని నందు నూతనంగా నిర్మించిన సమీకృత వెజ్-నాన్ వెజ్ మార్కెట్ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించారు. సముదాయంలోని దుకాణదారులతో మంత్రి మాట్లాడి సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. నగర ప్రజల అవసరాలకనుగుణంగా కూరగాయలు, మాంసాహారం అన్ని ఒకే సముదాయంలో లభించే విధంగా సదుపాయాలను సమకూర్చడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు ఆదేశాలు చేశారు.

పార్కింగ్ కి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని, త్రాగునీరు, విద్యుత్ ఏర్పాట్లకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలోనే సమీకృత వెజ్-నాన్వెజ్ మార్కేట్ ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులచే లాంఛనంగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.

మంత్రి వెంట నగర మేయర్ పునుకొల్లు నీరజ, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్వేత, ఏ.ఎమ్.ఓ నాగరాజు స్థానిక ప్రజాప్రతినిధులు,
తదితరులు పాల్గొన్నారు
.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page