
- త్వరలో RTCలో నియామకాలు: మంత్రి.
- TGSRTCలో త్వరలో 3038 మంది డ్రైవర్లు, కండక్టర్లతో పాటు కారుణ్య నియామకాలు చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. 3500 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందినా గత ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదని, కొత్త బస్సులు కొనలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం 2000 కొత్త బస్సులు కొనుగోలు చేసిందని, మరో 600 బస్సులను డ్వాక్రా సంఘాలు కొంటాయని చెప్పారు. HYDలో పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతామని తెలిపారు.
