
భార్యను ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించిన మీర్పేట్ గురుమూర్తి ఘటన వెలుగుచూసిన నెలల వ్యవధిలోనే మరో దారుణం జరిగింది. భార్యను హత్య చేసి, గుండె పోటు కథ అల్లిన భర్త ఉదంతం హైదరాబాద్లోని చాదర్ఘాట్ పరిధిలో వెలుగుచూసింది. ఈ..ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓల్డ్ మలకపేట జమున టవర్స్లో సింగం శిరీష, వినయ్ కుమార్ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. శిరీష స్వగ్రామం శ్రీశైలం సమీపంలోని దోమలపేట. శిరీష జమున టవర్స్లోని తన నివాసంలో ఆదివారం అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. గుండెపోటు అని శిరీష తల్లిదండ్రులకు కాల్ చేసి ఆమె భర్త వినయ్ సమాచారం ఇచ్చాడు.
శిరీష కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరకముందే ఆమె మృతదేహాన్ని సొంత గ్రామం శ్రీశైలం సమీపంలోని దోమల పెంటకు అంబులెన్సులో తరలిస్తుండగా పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో కొట్టి చంపి.. గుండెపోటుగా చెబుతున్నారని.. శిరీష భర్త గుండెపోటు కథ అల్లాడని చాదర్ ఘాట్ పోలీసులకు శిరీష కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. తన కూతురును అన్యాయంగా పొట్టనబెట్టుకున్నాడని శిరీష కుటుంబం కన్నీరుమున్నీరైంది. ఈ ఘటనతో ఓల్డ్ మలకపేటలోని జమున టవర్స్ ఉలిక్కిపడింది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app