బిజెపి మెడికల్ క్యాంపును ప్రారంభించిన జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణ..

Spread the love

medical camp inaugurated BJP National Vice President DK Aruna

సాక్షిత : మెడికల్ క్యాంపుకు ప్రజల నుండి విశేష స్పందన

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా సేవా పక్షంలో భాగంగా గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ లో మెడికల్ క్యాంపు ఉచిత మందుల పంపిణీ కార్యక్రమంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ ప్రారంభించారు..డాక్టర్లు రోగులను పరిశీలించి ఉచితంగా మందులు,రాగి సంకటి పంపిణీ చేశారు …

అనంతరం విలేఖరుల సమావేశంలో డికె. అరుణమ్మ మాట్లాడుతూ..

ప్రధాన నరేంద్ర మోడీ సేవపక్షం లో భాగంగా పక్షం రోజుల పలు సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, చెట్లు నాటడం,స్వచ్ఛ భారత్, కార్యక్రమాలు అందులో భాగంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది..

నరేంద్ర మోడీ లక్ష్యం జన ఔషధ సంస్థ ద్వారా పేద ప్రజలకు తక్కువ ధరకు మందులు పంపిణీ చేయాలని లక్ష్యంతో ఈ మెడికల్ క్యాంపులో ఫ్రీగా జనరిక్ మందులు ఇవ్వడం జరిగింది…

గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు తక్కువ ధరకే మందులు పంపిణీ చేయాలని ఉద్దేశంతో మండలానికి ఒకటి చొప్పున జన ఔషధ సంస్థ వారు జనరిక్ మెడిసిన్ ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో ఉన్నారు. వాటిని ప్రజలకు అందుబాటులో త్వరలో చేపడతారని అన్నారు..

Related Posts

You cannot copy content of this page