
మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆశీస్సులతో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే నాయకత్వంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి పాటుపడి ఇటీవల పదవీకాలం ముగించుకున్న నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు ప్రణయ ధనరాజ్ యాదవ్, రజిత రవికాంత్, రవి కిరణ్, గాజుల సుజాత, ఆగం రాజు, కాసాని సుధాకర్ ముదిరాజ్, పైడి మాధవి, రఘూవేంద్ర రావు, బొర్రా దేవి చందు ముదిరాజ్, కో ఆప్షన్ సభ్యలు ఏనుగుల అభిషేక్ రెడ్డి, సయ్యద్ సలీం,వారి సేవలను కొనియాడుతూ,వారిని ఆత్మీయంగా సత్కరించిన ఎమ్మెల్సీ శంభీపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద . మాజీ డిప్యూటీ మేయర్, మాజీ కార్పొరేటర్లు, మాజీ కో ఆప్షన్ సభ్యులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ శంభీపూర్ , ఎమ్మెల్యే కేపీ వివేకానంద , సహకారంతో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో అభివృద్ధి పనులు చేశామని, పదవులు ఉన్నాలేకున్నా ప్రజల కోసమే పని చేస్తామని అన్నారు. తమ రాజకీయ గురువులు ఎమ్మెల్సీ శంభీపూర్ , ఎమ్మెల్యే కేపీ వివేకానంద కు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app