SAKSHITHA NEWS

మేడారం మినీ జాతరకు ఇంకా19 రోజులే..

మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర సమీపిస్తోంది.జాతరకు ఇంకా 19 రోజులే మిగిలి ఉండగా,ఇప్పటికే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వనదేవతలను దర్శించుకుంటున్నారు.కాగా,మినీ జాతరకు ప్రతిఏటా లక్షల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. ఈ మేరకు ప్రస్తుతం జాతరలో అరకొర వసతులతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.ఈ మేరకు నేడు మంత్రి సీతక్క మేడారంలో వివిధ శాఖల అధికారులు, పూజారులతో సమీక్ష నిర్వహించనున్నారు.