హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి

Spread the love


Marri Chenna Reddy Human Resource Development in Hyderabad

హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ప్రాజెక్ట్ అధికారులు, DFOS మరియు DTDOలతో ఏర్పాటు చేసిన
అటవీ హక్కుల చట్టంపై కన్వర్జెన్స్ వర్క్‌షాప్ కు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గిరిజన స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ .

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ…..

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారంతో పాటు అటవీ సంపద సంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదని
రాష్ట్ర గిరిజ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పోడు సర్వేలో తలెత్తిన సమస్యలు వాటి పరిష్కారానికి మార్గాలపై అధికారుల సలహాలు సూచనలు తీసుకుని దిశ నిర్ధేశం చేసారు మంత్రి.

సుదీర్ఘమైన పోడు సమస్య శాశ్వత పరిష్కారానికై ముఖ్యమంత్రి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని, అందుకు అనుగుణంగా అటవీ హక్కుల చట్టం- 2005 నియమనిబంధనల ప్రకారం పోడు భూములు సాగు చేసుకుంటున్న వారికి శాశ్వతం పరిష్కారం దిశగా సమస్యకు ముగింపు పలికేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదని మంత్రి అన్నారు

. పోడు వ్యవసాయదారులకు న్యాయం చేసేందుకు అడవులను సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, అటవీ హక్కుల చట్టం- 2005 పరిధికి లోబడి పోడు వ్యవసాయ దారులకు న్యాయం చేకూర్చే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.

ఆర్.ఓ.ఎఫ్.ఆర్.2005 చట్టం,గ్రామ కమిటీ లు హ్యాబిటేషన్ వారీగా, డివిజన్ వారీగా, జిల్లా కమిటీ లు ఏర్పాటు, కమిటీ ల బాధ్యతలు గురించి మంత్రి వివరించి సందేహాలు నివృత్తి చేశారు. పోడు పేరు పై ఇకముందు అడవుల నరికివేతకు పాల్పడే వారిపై కఠిన చర్యలుంటాయని, అవసరమైతే ప్రత్యేక చట్టాలు అమలు చేసి అడవులను పరిరక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు.

నరికివేత వలన వాతావరణ సమతుల్యం దెబ్బతింటుందని అన్నారు. హరితహారం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా కోట్లాది మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచేందుకు తీసుకుంటున్న కార్యక్రమాలలో అటవీ శాఖ మాత్రమే కాకుండా అన్ని శాఖల, ప్రజలు, ప్రజా ప్రతినిధులు ప్రజా ఉద్యమం గా పెద్ద ఎత్తున భాగస్వాములై చెట్లు నాటుతున్నారని, హరిత హారం ఫలితాలు కనిపిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రం లో 24 శాతం అటవీ విస్తీర్ణం ఉందని తెలిపారు..ప్రతి ఒక్కరూ అడవుల సంరక్షణకు కట్టుబడి ఉండాలని,మానవ,జీవ జాతుల మనుగడ అడవుల సంరక్షన పై ఆధారపడి ఉందని అన్నారు. అడవుల క్షీణత వలన గ్లోబల్ వార్మింగ్ తో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, పర్యావరణ సమస్యలు వస్తున్నాయని అన్నారు.

అడవుల పునరుద్ధరణ లో దేశం లోనే తెలంగాణ రాష్ట్రం ముందు ఉందని మంత్రి స్పష్టం చేసారు. పోడు భూముల సమస్య పరిష్కారం పారదర్శకంగా పూర్తి చేయాలని అర్హులైన గిరిజనులు, గిరిజనేతరులకు అటవీ హక్కు లు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఎక్కడ సమస్యలు రాకుండా చూసుకుని ,

అర్హులు కానీ వారికి కారణాలను వివరణాత్మకంగా వారికి తెలియజేయలని సూచించారు. సర్వేలో అటవీ, రెవెన్యూ, పోలీస్ అధికారులు సమన్వయంతో పారదర్శకంగా తమ విధులను మరింత బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని మంత్రి సూచించారు.

ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి, పర్గీన్ పిసిసిఎఫ్ మరియు పీవో లు, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు అటవీ అధికారులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page