పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మంచు మనోజ్.
మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం పోలీస్ స్టేషన్ కి చేరింది.
హీరో మంచు మనోజ్ పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తనపై దాడి పట్ల చర్యలు తీసుకోవాలని పోలీసులకు మనోజ్ కంప్లెంట్ ఇచ్చారు.
బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దెబ్బలతో కుటుంబ సభ్యులతో మనోజ్ వెళ్లిన విషయం తెలిసిందే.
మెడికల్ రిపోర్టులు ఆధారంగా పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.