ఫూలే విగ్రహాన్ని ప్రతిష్టించాలంటూ మంచిర్యాల మున్సిపల్ కౌన్సిల్ .

Spread the love

Manchiryala Municipal Council to install Phule statue.

ఫూలే విగ్రహాన్ని ప్రతిష్టించాలంటూ మంచిర్యాల మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు వినతి పత్రం.

                

మంచిర్యాల పట్టణంలో మహాత్మ ఫూలే విగ్రహాన్ని ప్రతిష్టించాలంటూ మంచిర్యాల జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు మున్సిపల్ చైర్మన్ కు, కౌన్సిల్ సభ్యులకు విన్నవించారు. ఈ మేరకు మంచిర్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన చైర్మన్ మరియు కౌన్సిలర్లందరికీ వివిధ సంఘాల నాయకులు వినతి పత్రం అందజేశారు.


దేశంలోని మెజారిటీ వర్గాల సంక్షేమం కోసం రెండు శతాబ్దాల క్రితమే ఉద్యమించిన మహాత్మ జ్యోతిరావు ఫూలేను సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు గౌరవిస్తారని వారు తమ వినతి పత్రంలో పేర్కొన్నారు. మెజారిటీ వర్గాల వెనుకబాటుకు కారణమైన కుల దురహంకార దౌర్జన్యాలను తన “గులాంగిరీ”పుస్తకం ద్వారా తెలియజెప్పడమే కాకుండా..

“సత్యశోధక్ సమాజ్” సంస్థను స్థాపించి.. మెజారిటీ వర్గాలపై జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి నడుం కట్టిన మహాత్ముడు ఆయన. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకూ ఫూలే గొప్పతనం గురించి, ఆయన చేసిన త్యాగాల గురించి, సామాజిక న్యాయ ఆవశ్యకత గురించి చెప్పాలంటే మహాత్మా ఫూలే విగ్రహం మన పట్టణంలో ప్రతిష్ఠితం కావాలి.


మెజారిటీ వర్గాల ఆకాంక్షల మేరకు మంచిర్యాల పురపాలక సంఘం బాధ్యులుగా ఛైర్మన్ మరియు కౌన్సిలర్లూ చొరవ తీసుకుని.. స్థానిక బెల్లంపల్లి చౌరస్తాలో మహాత్మా ఫూలే విగ్రహాన్ని ప్రతిష్టించాలని, ఫూలే చౌరస్తాగా నామకరణం చేయాలని వారు కోరారు. గతంలోనూ ఫూలే విగ్రహ స్థాపన కోసం మంచిర్యాలలోని అన్ని సంఘాల తరఫున వినతిపత్రం ఇవ్వడం జరిగిందని

, ఇక ఆలస్యం చేయకుండా సత్వరమే మహాత్మా ఫూలే విగ్రహాన్ని మంచిర్యాలలో మున్సిపల్ నిధులతో ప్రతిష్టించాలని వారు కోరారు. ఈ మేరకు చైర్ పర్సన్ శ్రీపెంట రాజయ్య, వైస్ చైర్పర్సన్ ముఖేష్ గౌడ్, ప్రతిపక్ష నాయకులు రావుల ఉప్పలయ్య కౌన్సిలర్లు అందరికీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బీసీ ఐక్య వేదిక కన్వీనర్ కనుకుంట్ల మల్లయ్య, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ నీలకంటేశ్వర రావు, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, బహుజన ఐక్యవేదిక నాయకులు పలిగిరి కనకరాజు,బీసీ సబ్ ప్లాన్ సాధన సమితి కన్వీనర్ మోతె రామదాసు, గిరిజన ఐక్యవేదిక నాయకులు కోవ జంగు, నేరెళ్ల వెంకటేష్, బోనగిరి రాజారెడ్డి, కాడె ఎల్లయ్య వివిధ దళిత బహుజన ప్రజాస్వామిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page