మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గము కాసిపేట్ మోడల్ స్కూల్

Spread the love

Manchiryala District Bellampally Constituency Kasipate Model School

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గము కాసిపేట్ మోడల్ స్కూల్,బాలికల వసతి గృహ భవనాలను ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి .


సాక్షిత : తాండూర్ లో కేజీబీవీ పాఠశాల హాస్టల్ భవనాన్ని ప్రారంభించి,బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికల వసతి గృహాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…..బాగా చదివి వృద్ధిలోకి రావాలని బంగారు భవిష్యత్తు కు బాటలు వేసుకోవలన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించటానికి ఎంత కష్టపడ్డారో,వచ్చిన రాష్టాన్ని దేశంలోనే మొదటి స్థానం లో నిలుటానికి అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు.

ప్రపంచంలో ఎక్కడకు వెళ్లిన తెలంగాణ విద్యార్థులు రాణించేలా తయారు కావలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అన్నారు.

రాష్ట్రంలో అమ్మాయిల విద్య కు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం..రాష్ట్రంలో ఉన్నత విద్యలో అమ్మాయిల సంఖ్య పెరుగుతుంది… ఉస్మానియా యూనివర్సిటీలో 60 శాతం, కాకతీయ విశ్వవిద్యాలయం లో 70 శాతంకు చేరిందన్నారు.

కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం మోడల్ పాఠశాలల నిర్వహణ నుండి వెనక్కి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వం మీద 400 కోట్ల భారం అవుతున్న 1లక్ష 25 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు.

కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా దశల వారీగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో 1000 గురుకులాలు ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థి పై ఒక లక్ష 25 వేలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.

8 ఏళ్లలో 1150 జూనియర్ రెసిడెన్షియల్ కళాశాలలు 85 డిగ్రీ కళాశాలలు,వీటిలో 53 ప్రత్యేకంగా అమ్మాయిలకు,5 పీజీ కళశాలలు నెలకొల్పిన ప్రభుత్వం.

విదేశీ విద్యకు 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్ షిప్ లు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది,సుమారు 4 వేల పై చిలుకు మంది విదేశీ విద్య చదువుతున్నారు.రేపు వారు తెలంగాణ కు ఒక ప్రత్యేక వనరులుగా మారుతారు…రాష్ట్ర అభివృద్ధి లో భాగస్వాములు అవుతారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక యజ్ఞం లాగా మన ఊరు మన బడి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు..

7 వేల కోట్లతో 26 వేల పాఠశాలలు రూపురేఖలు మార్చే ప్రతిష్టాత్మక కార్యక్రమం మన ఊరు మన బడి,మన బస్తీ మన బడి కార్యక్రమం.

ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి,పుట్టిన ఊరు చదువుకున్న పాఠశాలల బాగుకు ప్రభుత్వంతో కలిసి రావాలి.

చాలా మంది ప్రయివేటు పాఠశాలల వైపు మొగ్గు చూపటానికి ఇంగ్లీష్ మీడియం కారణం అవ్వటంతో, ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుండి ఒకటో తరగతి నుండి 8 వ తరగతి ఆంగ్లబోధన ప్రారంభించాం.

గత సంవత్సరం పాఠ్య పుస్తకాల కోసం 60 కోట్లు ఖర్చు చేయగా ప్రస్తుత విద్యా సంవత్సరం లో రెండు భాషల్లో పుస్తకాలు ముద్రించించటం వల్ల 120 కోట్లు ఖర్చు అయింది.

ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్ నేత ,ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ,ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి ,విద్యా శాఖ కార్యదర్శి కరుణ ,విద్యా మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ శ్రీధర్ రెడ్డి ,కలెక్టర్ భారతి హోళీకేరి పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page