గన్నేరువరంలో పింఛన్ కార్డులను పంపిణీ చేసిన మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి

Spread the love

గన్నేరువరంలో పింఛన్ కార్డులను పంపిణీ చేసిన మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి ..
……………………………….

  • సాక్షిత : అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందిస్తామని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ తెలిపారు
  • మానకొండూర్ నియోజకవర్గంలోని గన్నేరువరం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నూతన పింఛన్ల మంజూరు పత్రాలను ఆయన లబ్దిదారులకు పంపిణీ చేశారు
  • ఈ సంధర్బంగా తమ అభిమాన నాయకుడు రసమయి కి ప్రజలు, ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, భారీ బైక్ ర్యాలీతో పాటు పూల వర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు
  • అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన లబ్దిదారులకు ఎమ్మెల్యే రసమయి ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు
  • ఈ సంధర్బంగా ప్రజలనుద్దేశించి ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతూ పేదలు
    ఆత్మ గౌరవంతో బతుకాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అన్నారు
  • పేదింటి మహిళలు ఆర్థిక పురోగతి సాధించడానికి బ్యాంకు లింకేజీ రుణాలు కూడా అందజేయడం జరుగుతుందన్నారు. 57 సంవత్సరాలు నిండిన పేదలందరికి రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందిస్తుందని చెప్పారు.
  • రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ కే దక్కిందన్నారు
  • పింఛన్ల మంజూరు నిరంతర పక్రియ అని, ఇంకా ఉన్న అర్హులకు కూడా త్వరలోనే కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు
  • ఇచ్చిన మాటకు కట్టుబడి వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని రసమయి వివరించారు
  • ఈ సంధర్బంగా సాంస్కృతిక సారథి కళాకారులు ఆలపించిన గీతాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి..

Related Posts

You cannot copy content of this page