
విజయవాడ
విద్యార్థి ప్రాణాలు కాపాడలేని విద్యాసంస్థ యాజమాన్యం..
సిద్ధార్థ మహిళా కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న హర్షిని అనే విద్యార్థిని నిన్న ఫిట్స్ తో బాధపడుతూ మృతి చెందారు. సరైన వైద్యం అందించకనే విద్యాసంస్థ యాజమాన్యమే మహిళ విద్యార్థి మృతికి కారణమంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు..
విద్యార్థికి ఫిట్స్ వచ్చే సమయానికి సరైన వైద్యం అందించలేదని, కనీసం అంబులెన్స్ ని కూడా ఫోన్ చేయలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు..
సదరు విద్యాసంస్థ పై న్యాయపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు
