రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం

Spread the love

Mana Uru – Mana Badi Program is a very prestigious initiative of the state government

సాక్షిత : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ లో గల మండల ప్రాథమిక పాఠశాలలో రూ. 4.02 లక్షల రూపాయల తో మౌలిక వసతుల ఏర్పాట్ల ను మండల విద్యాధికారి వెంకటయ్య మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మన ఊరు – మన బడి కార్యక్రమం మొదటి విడతలో పనులు పూర్తయిన పాఠశాలలు ఫిబ్రవరి 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం చేయడం జరిగినది అని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి అని నిన్న, మొన్నటి దాకా శిథిలావస్థలో కునారిల్లిన పాఠశాలలు సైతం నేడు అధునాతన సకల హంగులతో, కొత్త సొగసును సంతరించుకుంటున్నాయి. చూడముచ్చటైన తరగతి గదులు…. క్లాస్‌రూంలో డ్యూయల్‌ డెస్క్‌లు.. విద్యుత్తు వెలుగులు..

పరిశుభ్రమైన టాయిలెట్లు.. స్వచ్ఛమైన మంచినీళ్ల ట్యాంక్‌లు.. వంటగదులు.. భోజనశాలలు.. వాకింగ్‌ ట్రాక్‌లు.. చుట్టూ ప్రహరీలు.. ఇలా అనేక సకల సదుపాయాలతో విద్యార్థులు ఏకాగ్రతతతో నిశ్చింతగా చదువులు కొనసాగించేందుకు అవసరమైన ఆహ్లాదకర వాతావారణాన్ని పంచిపెడుతున్నాయి. పిల్లల చదువులకు సరికొత్త భరోసాను అందిస్తున్నాయి.

నేడు ప్రభుత్వ పాఠశాలు అసలు సిసలు సరస్వతీ నిలయాలుగా రూపుదిద్దుకుంటున్నాయి అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను అన్ని రకాల వసతుల తో ప్రయివేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే క్రమంలో మన ఊరు మన బడి కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప విషయం అని ప్రభుత్వ గాంధీ పేర్కొన్నారు .

ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు కలిపించడమే ధ్యేయం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా మన ఊరు మన బడి మొదటి విడతలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి శేరిలింగంపల్లి మండలం పరిధిలో 24 మరియు కూకట్పల్లి మండలం పరిధిలో 7 మొత్తము 31 ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కలిపించడం జరిగినదిఅని, మిగతా పాఠశాలలను దశల వారిగా పూర్తి చేసి శేరిలింగంపల్లి ని ఆదర్శవంతమైన నియోజకవర్గం గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కుమార్ గౌడ్ , మియాపూర్ పాఠశాలల సముదాయప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కే వసుంధర , స్థానిక పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ శ్రీమతి వి ఈశ్వరి , స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఐ శ్రీలత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్,మాదాపూర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్,

మియాపూర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు BSN కిరణ్ యాదవ్, బీఆర్ ఎస్ పార్టీ నాయలులు అదిల్ పటేల్ బలరాం యాదవ్,తిరుపతి, రజినీకాంత్, తిరుపతి, తాడెం మహేందర్, గఫుర్, గణపతి,మహ్మద్ అలీ,వేణు గోపాల్ రెడ్డి, అక్షయ్, రూప రెడ్డి, శారదమ్మ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page