SAKSHITHA NEWS

బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయండి

ఈ నెల 10 నుండి 15 వరకు అంగరంగ వైభవంగా చెన్నకేశవ స్వామి జాతర

జాతరకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన ఆలయ కమిటీ

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి అధ్యయన బ్రహ్మోత్సవాలు ఈ నెల 10వ తేది నుండి 15వ తేది వరకు ఆలయంలో వైభవంగా జరగనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ గూకంటి రాజబాబు రెడ్డి తెలిపారు.గత 120 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతూ ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఈ సంవత్సరం జాతరకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాకు అతి చేరువలో ఉన్న పిల్లలమర్రి నందు కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలు ఉన్నాయి.ప్రాచీన శిల్పకళకు వేదికగా పిల్లలమర్రి పేరుగాంచింది.ఇక్కడ ఉన్న ఆలయాలు పురాతన కాలం నాటివి జిల్లాలో ఉత్తర ముఖం కలిగి ప్రాచీన ఆలయంగా ప్రసిద్ధి గాంచిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి గాంచింది అన్నారు.

ఇక్కడ స్వామి వారు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కొలువుదీరి భక్తుల ఇతి బాధలను నివారిస్తున్నారు.వివాహం సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం కోసం భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి ముడుపులు కట్టి ప్రదక్షిణాలు చేయటం ఇక్కడ విశేషం.పిల్లలమర్రి చుట్టుపక్కల కాకుండా సదూర ప్రాంతాల నుండి ఆలయానికి భక్తులు వచ్చి వారి మొక్కులు చెల్లించుకుంటారని సూచించారు.ప్రాచీన ఆలయాలకు పిల్లలమర్రి నిగూఢ క్షేత్రం అని భక్తులు వేలాదిగా తరలి వచ్చి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి జాతరను జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ముడుంభై రఘువరన్ ఆచార్యులు, ఆలయ ధర్మకర్త ఉమ్మెంతల ఆహ్లాదరావు, ఉమ్మెంతల హరిప్రసాద్ ,వైస్ చైర్మన్ మంగపండ్ల మల్లికార్జున్ కమిటీ సభ్యులు కందకట్ల రాంబాబు, బంగారి కృష్ణయ్య, బంగారి సైదమ్మ మల్లయ్య,కుమ్మరికుంట్ల జనయ్య ,గంపల శంకర్,కోనేటి కృష్ణ,చెరుకుపల్లి రాజు, లోడే వేణు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app